RTC విషయంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. RTC కోలుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదన్నారు. అయితే 50శాతం ప్రైవేట్ వాళ్లకు ఇస్తే సమస్యను బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా లేదని, యూనియన్లపై మాత్రమే సీరియస్ గా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. RTC సమ్మెపై ప్రభుత్వం నిర్ణయాలు ప్రకటిస్తుందన్నారు.
RTC కోలుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదు:ఎర్రబెల్లి