RTC కార్మికులకు నేటి రాత్రివరకు డెడ్ లైన్


 నేటి అర్థరాత్రిలోగా విధుల్లో చేరని కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చుకోవద్దని ప్రభుత్వ నిర్ణయించింది. విధుల్లో చేరడానికి గడువు ఇవ్వడం ద్వారా మంచి అవకాశం ఇచ్చామని, దాన్ని ఉపయోగించుకుని ఉద్యోగాలు కాపాడుకోవడమా లేక ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాన్ని కూడా ఇబ్బందుల పాలు చేయడమా అనేది కార్మికులే తేల్చుకోవాలని ప్రభుత్వం చెబుతోంది.