గాంధీ కుటుంబం లేకుండా చేయాలని RSS కుట్ర


సోనియా గాంధీ, రాహులకు SPG భద్రతను కేంద్రం తొలగించడాన్ని ఖండిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గాంధీ కుటుంబం లేకుండా చేయాలని ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చనిపోయిందని అసద్ అనడం విచారకమన్నారు. BJP ని గెలిపించడానికి అసద్ మహారాష్ట్రకు వెళ్లి ప్రచారం చేశారన్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా RTC కార్మికులు చలో ట్యాంక్ బండ్ ను సక్సెస్ చేశారని వీహెచ్ అన్నారు.