ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తోందని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. భారత రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్ఫూర్తికి ఈ జీవో వ్యతిరేకంగా ఉందని తెలిపింది. ఈ జీవోపై AP మీడియాకు చెందిన వారు చేస్తున్న ఆందోళనలకు సంఘీభావం తెలిపింది. ఈ మేరకు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా శనివారం ఓ ప్రకటన జారీ చేసింది.