శ్రీలంక నూతన ప్రధానిగా మహింద రాజపక్స నియమితులు కానున్నారు. తన సోదరుడైన గోటబాయ రాజపక్స దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మహీందా రాజపక్సను దేశ కొత్త ప్రధానిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమ సింఘే గురువారం ఉదయం రాజీనామా చేస్తారనీ... ఆయన స్థానంలో మహింద రాజపక్స బాధ్యతలు చేపడతారని ప్రభుత్వ అధికార ప్రతినిధి విజయానంద హెరాత్ స్పష్టంచేశారు.
శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స!