గురునానక్ జయంతికి ఘనంగా ఏర్పాట్లు

 


 


సిక్కు మత గురువు గురునానక్ 550వ జయంతి వేడుకలు నేడు వైభవంగా జరగనున్నాయి. సుల్తాన్ పుర్ వీధి లో ఏర్పాటు చేసిన ప్రధాన కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. గురుపర్వ్ కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి భక్తులు హాజరుకానున్నారు. పంజాబ్ వ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్రమంత్రి అమిత్ షా సహా పలువురు రాజకీయ ప్రముఖులకు ఉత్సవ నిర్వాహకులు ఆహ్వానం పలికారు.