కోట్ల ఖరీదైన వాచీ

 



 ఓ ఛారిటీ సంస్థకు విరాళాల సేకరణలో భాగంగా స్విట్జర్లాండ్ లోని జెనీవాలో క్రిస్టీస్ అనే సంస్థ నిర్వహించిన వేలంలో ఓ చేతి గడియారం రికార్డు స్థాయి ధర పలికింది. విలాసవంతమైన చేతి గడియారాలు తయారు చేసే 'పాటెక్ ఫిలిప్పే' సంస్థకు చెందిన వాచీని అక్షరాల 31 మిలియన్ డాలర్ల (సుమారుగా రూ. 222 కోట్లు)కు ఓ అజ్ఞాత వ్యక్తి వేలంలో దీన్ని సొంతం చేసుకున్నాడు. ఊహించిన ధర కంటే 12 రెట్లు అధిక ధర పలకడం విశేషం.