ట్యాక్సీ సేవల్లో దూసుకెళ్తున్న ...OLA ఆహార వ్యాపార విభాగంలో భారీగా విస్తరిస్తోంది. దీనికోసం సొంత ఫుడ్ బ్రాండను ప్రవేశపెడుతోంది. స్విగీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ లో వీటిని లిస్ట్ చేయడంతో పాటు సొంతంగా రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లు, ఫుడ్ ట్రక్కులు, చిన్నపాటి కియోస్క్లు కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. భోజనం మొదలుకుని బిర్యానీలు, డెసలు.. ఇలా అన్ని రకాల ఆహారాలకు సంబంధించి ప్రత్యేక బ్రాండ్ను రూపొందించే ప్రయత్నాల్లో ఉంది.