సరైన ఆహారంతో ముదిమిలోనూ 'వినికిడి' పదిలం

 



 ఆరోగ్యకర ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా వినికిడి ముప్పును కాస్త నిలువరించవచ్చునని చెప్తోంది తాజా అధ్యయనం. అమెరికాలోని బ్రిగ హామ్- మహిళా ఆస్పత్రికి చెందిన షరోన్ కుర్హాన్ నేతృత్వంలోని పరిశోధకులు దాదాపు 20 ఏళ్లపాటు పలువురి ఆహార అలవాట్లను, వారిలో వినికిడి శక్తి క్షీణతను క్షుణ్నంగా పరిశీలించారు. సరైన ఆహార నియమాలను పాటిస్తూ, ఆరోగ్యకర పదార్థాలను భుజిస్తున్నవారిలో ఇతరులతో పోలిస్తే వినికిడి శక్తి క్షీణత అవకాశాలు 30 శాతం తక్కువగా కనిపిస్తున్నట్లు తేల్చారు.