త్వరలో నిర్మాతగా మారనున్న జూనియర్ NTR


 ఇప్పటికే మహేశ్ బాబు, రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండ తదితరులు నిర్మాణ రంగంలోనూ సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ జాబితాలో ఎన్టీఆర్ కూడా చేరబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన సొంత నిర్మాణ సంస్థను స్థాపించబోతున్నట్లు తెలుస్తోంది.ఓ మంచి రోజు చూసుకుని నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.