నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (NAINS) పరీక్ష, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (NTSE లెవెల్-/) రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆదివారం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. విద్యార్థులు గంటముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టంచేశారు. విద్యార్థులు నలుపు లేదా నీలం రంగు బాల్ పెన్నులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
నేడు NMMS పరీక్ష..నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ