NDA నుంచి తీసేయడానికి మీరెవరు


 ప్రభుత్వ ఏర్పాటు విషయంలో విభేదాలు తలెత్తడంతో BJP పై విమర్శల దాడికి దిగిన శివసేన నేడు కూడా తీవ్రంగా విరుచుకుపడింది. తన అధికారిక పత్రిక సామ్నాలో హిందూత్వ, జాతీయవాద సిద్ధాంతాలను గుర్తుచేస్తూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ప్రస్తుతం BJP లో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులెవరూ జన్మించని కాలంలోనే శివసేన హిందుత్వ సిద్ధాంతాలకు మద్దతుగా నిలిచిందన్నారు. అలాంటి మమ్మల్ని NDA నుంచి తొలగించడానికి మీరెవరు' అంటూ ధ్వజమెత్తింది.