మహారాష్ట్రలో ప్రజారాజ్య ఖూనీ జరిగింది


 మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ BJP పై విరుచుకుపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వాన్ని ఏర్పర్చడం అంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు లోక్ సభలో రాహుల్ మాట్లాడుతూ... 'మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీకి గురైంది. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించిన్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు' అని వ్యాఖ్యానించారు.