శివసేన ఎంపీలపై మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రవి రాణా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకసభలో మాట్లాడిన ఆమె.. శివసేన వల్లే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఏర్పడిందని విమర్శించారు. స్వార్థం కోసం అలా చేశారని ఆరోపించారు. రైతుల పట్ల అంత సానుభూతి ఉంటే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అదే సమయంలో శివసేన సభ్యులు ఆమె ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
శివసేన ఎంపీలపై మండిపడ్డ MP నవనీత్