కర్ణాటక MLA ల అనర్హతపై 13న తుది తీర్పు


కర్ణాటకలో అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేల వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఈ నెల 13న తీర్పు వెలువరించనుంది. 17 మంది ఎమ్మెల్యేలను అప్పటి స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ వీరు గతంలో సుప్రీంను ఆశ్రయించారు. అక్టోబర్ 25న వాదనలు విన్న జస్టిస్ ఎన్ వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడి ఖాళీ అయిన 15 స్థానాలకు డిసెంబర్ 5న ఉపఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది.