దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్ ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. గడ్డం, మీసాలు సగమే తీసేయించుకొని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతరించిపోతున్న ఖడ్గమృగాల పరిరక్షణ, గోల్ఫ్ అభివృద్ధికి విరాళాలు సేకరించాలనే ఉద్దేశంతో తాను గడ్డం, మీసాలు సగమే తీసేయించుకున్నానని వెల్లడించాడు. ఇప్పటికే 4,80,000 దక్షిణాఫ్రికా ర్యాండ్ను తమ బృందం సేకరించిందని పేర్కొన్నాడు.
గడ్డం, మీసాలు సగమే తీసేయించిన క్రికెటర్