మా బలమేంటో అప్పుడు చూపిస్తాం: లక్ష్మణ్


 రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ గెలిచాక కేసీఆర్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఇదే సమయంలో బీజేపీ, మోదీ గ్రాఫ్ వేగంగా పెరిగిపోతోందన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలు తమ పార్టీపై ఏమాత్రం ప్రభావం చూపబోవన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ బలంమేంటో నిరూపించుకుంటామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు