ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కమిటీ ఏర్పాటు


 జగనన్న విద్యా దీవెన కింద రూ. 3400 కోట్లు ఖర్చు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. జగనన్న వసతి దీవెన కింద ఏడాదికి రూ. 2.300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, ఇందుకు రూ. 1,701 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు వివరించారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అధికారుల కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.