తెలంగాణలో తెలుగే ముద్దు


 ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే జరగాలని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ప్రైవేటులోనూ ఇదే విధానం అమలు చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సూచించడం గమనార్హం. నాలుగేళ్ల క్రితం సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా.. దాన్ని బలవంతంగా విద్యార్థులపై రుద్దలేదు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పదో తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా చదవాలని ప్రభుత్వం రెండేళ్ల క్రితం జీఓ జారీ చేసింది.