ప్రైమరీ ప్రాసెసింగ్ కేంద్రానికి KTR భూమిపూజ

 


 


సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి KTR పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో తంగళ్లపల్లి మండలం జిల్లెలలో నిర్మించిన మార్కెట్ గోదామును ఆయన ప్రారంభించారు. అనంతరం రూ.6 కోట్లతో ప్రైమరీ ప్రాసెసింగ్ కేంద్రానికి KTR భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.