యువతలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడమే ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమ లక్ష్యమని KTR అన్నారు. తక్కువఖర్చుతో పోర్టబుల్ వరి కలుపుతీసే యంత్రాన్ని కనిపెట్టినందుకు యువ ఆవిష్కర్త అశోకను KTR ప్రశంసించారు. ఇది వరిపొలాల నుంచి కలుపు మొక్కలను సులభంగా తొలగించడానికి ఉపయోగ పడుతుందని అన్నారు. ప్రగతి భవన్లో తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఫణీంద్రసామ, యువ ఆవిష్కర్త అశోక్ మంత్రి KTRను కలవగా, KTR యువ ఆవిష్కర్త అశోక్ ను ప్రశంసించారు.
అశోక్ కు KTR అభినందనలు .