రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు) పాఠశాలల్లోనూ తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి చేయండి.. అన్ని పాఠశాలల్లోనూ పిల్లలకు తెలుగు నేర్పాల్సిందే అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సెకండ్ లాంగ్వేజ్ ఉంటుందని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ చెప్పబోయారు. 'ప్రైవేట్ పాఠశాలల వారికి చిన్న అవకాశమిచ్చినా వాళ్లు తెలుగును తప్పించే ప్రయత్నం చేస్తారు. సెకండ్ లాంగ్వేజ్ అనో ఇంకోటనో వద్దు. తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి' అని సీఎం స్పష్టం చేశారు.
అన్ని పాఠశాలల్లోనూ తెలుగు తప్పనిసరి