దేశవ్యాప్తంగా మందుల ధరలు గణనీయంగా దిగిరానున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఔషధాల్లో దాదాపు 80 శాతం ఔషధాల ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు షెడ్యూలు జాబితాలో లేని ఔషధాలపై 30 శాతం లాభాలతో సరిపెట్టుకుంటామని ఔషధ పరిశ్రమ తయారీదార్లు, పంపిణీదార్లు అంగీకారానికి రావటం ఇందుకు వీలుకల్పిస్తోంది.
మందుల ధరలకు కళ్లెం!