వాతావరణంలో వస్తున్న మార్పులు మూగప్రాణుల పైనా ప్రభావం చూపిస్తున్నాయి. భూతాపం ప్రభావంతో వన్యప్రాణులు కొంత ముందుగానే సంతానాన్ని కంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ మేరకు తొలిసారిగా కొన్ని ఆధారాలను వారు సేకరించారు. స్కాట్లాండ్ లోని ఒక రకం జింకల్లో (రెడ్ డీర్లలో) ఇటీవలి కాలంలో జన్యుపరమైన మార్పులు వచ్చి.. అవి సంతానాన్ని కనే వ్యవధిని మార్చేస్తున్నాయని ఎడి విశ్వవిద్యాలయం (UK), ఆస్ట్రేలియా జాతీయ విశ్వ విద్యాలయాలకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు.
భూతాపం తో .. ముందుగానే ప్రసవం