కారాకు ఐదేళ్లు. దాదాపు 57 కిలోల బరువు. కారా అంటే అమ్మాయి కాదు, మనిషే కాదు. బెంగాల్ టైగర్ పిల్ల. అది జర్మనీలోని పులుల సంరక్షణ కేంద్రంలో ఉంటోంది. అది దాని కోసం కేటాయించిన బొమ్మలతో ఆడుకుంటూ ఓ కోర పన్నును ఊడ గొట్టుకుంది. డెన్మార్క్ చెందిన డెంటిస్టులను సంరక్షణ కేంద్రం అధికారులు పిలిపించారు. వారు రెండున్నర గంటలపాటు శస్త్ర చికిత్స చేసి దెబ్బతిన్న కోర పన్నును తొలగించి కోర పన్ను స్థానంలో బంగారంతో చేసిన పన్నును తీసుకొచ్చారు. దాదాపు గంటసేపు శస్త్ర చికిత్స చేసి దానికి ఈ పన్నును అమర్చారు.
బెంగాల్ టైగరకు బంగారు పన్ను