కడప ప్లాంటు ఇనుప ఖనిజం సరఫరాకు కేంద్రం ఓకే


 కడప స్టీల్ ప్లాంట్ కు ఎన్ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం సరఫరాకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకారం తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో కేంద్రమంత్రితో సీఎం జగన్ సమావేశం ముగిసింది. ఎన్ఎండీసీ, ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరే అవకాశముంది. వనరుల వినియోగం ద్వారా వస్తున్న ఆదాయాల మేరకు చమురు కంపెనీలకు సీఎస్ఆర్ నిధులు కేటాయించనుంది. ముమ్మడివరం మత్య్సకారులకు రూ.81 కోట్లను త్వరలో చెల్లిస్తామని ఓఎన్జీసీ వెల్లడించినట్లు సమాచారం.