ఫేస్బుక్ సేవల విస్తరణ


సరికొత్త ఆన్లైన్ చెల్లింపుల సేవలు అందించేందుకు 'ఫేస్ బుక్ పే' అందుబాటులో వచ్చింది. ప్రజలు సులువైన, సురక్షితమైన, నమ్మకమైన చెల్లింపులు జరపడానికి వీలుగా తాము ఈ సేవను ప్రారంభిస్తున్నామని ఫేస్ బుక్ ప్రకటించింది. దీనిని ఉపయోగించి కొనుగోళ్లు, చెల్లింపులతో పాటు విరాళాలు, నగదు లావాదేవీలను కూడా చేసుకోవచ్చని ఆ సంస్థ పేర్కొంది. దీనిని ఫేస్ బుక్ లో మాత్రమే కాకుండా మెసెంజర్, ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ లో కూడా వినియోగించుకోవచ్చని తన వెబ్ సైట్ లో పేర్కొంది.