జిల్లాలోని ములకలచెరువు టమోటాలు అండమాను ఎగుమతి అవుతున్నాయి. చెన్నై నుంచి ఓడ ద్వారా టమోటాలను తరలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన వ్యాపారి బాబుఖాన్ ములకలచెరువులో టమోటాలను కొనుగోలు చేసి అండమాన్‌కు పంపుతున్నారు. 15 టన్నుల పచ్చికాయలను ప్యాకింగ్ చేసి చెన్నైకి గురువారం తరలించారు. ఓడలో తరలించేందుకు బాక్సుకు రూ.750 వరకు ఖర్చు వస్తుందని వ్యాపారి చెబుతున్నారు. చెన్నై నుంచి టమోటాలు ఓడలో అండమాన్‌కు వెళ్ళేందుకు 8 రోజులు సమయం పడుతుంది.
అండమాను మన టమోటా..!