తెలంగాణ RTC లో 5,100 రూట్ల ప్రైవేటీకరణ పర్మిట్లపై హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. పర్మిట్లపై మధ్యంతర ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం సోమవారం వరకు పొడిగించింది. రూట్ల పర్మిట్లపై మంత్రి మండలి నిర్ణయాన్ని అడ్వొకేట్ జనరల్ సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారు. మరో వైపు RTC కార్మికుల వేతనాలపై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది.
రూట్ల పర్మిట్లపై స్టే పొడిగించిన హైకోర్టు