వస్తు-సేవల పన్ను (GST)లో సమూల మార్పులు జరగాలని 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్ సూచించారు. పన్ను మదింపులో గజిబిజి విధానాలను తగ్గించాలని, పన్నుల శ్లాబులను ప్రతిసారీ మార్చడాన్ని నిలిపివేయాలన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను హేతుబద్ధీకరించాలని సూచించారు. ఆర్థిక సంబంధ నిర్ణయాలు తీసుకోవడంలో నీతి ఆయోగకు ఎలాంటి అధికారాలు లేవని చెప్పారు.
GST సమూల మార్పులు అవసరం