ఆంగ్లమాద్యమంపై ప్రతిపక్షాలు బోడిగుండుకి.. మోకాలికి ముడిపెడుతున్నాయని దుయ్యబట్టారు. ఇంగ్లిష్ భాషకు, క్రైస్తవ మతానికి ముడిపెడుతున్న వారికో దండం అంటూ వ్యాఖ్యానించారు. ఇంగ్లిష్ నేర్చుకోవాలని పీఠాధిపతులు, మఠాధిపతులే చెబుతున్నారని గుర్తుచేశారు. క్రైస్తవ మత ప్రచారం పేరుతో రాద్దాంతం చేయడం సరికాదని విపక్ష నేతలకు తమ్మినేని చురకలంటించారు.