అంతరించిపోయే పక్షి జాతులను గుర్తించడానికి పర్యావరణ DNA (E DNA) విధానం ఉపయోగపడుతుందని పరిశోధకులు తేల్చారు. ఈ విహంగాలు నీరు తాగే చోట స్వల్ప పరిమాణంలో నమూనాలను సేకరించడం ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. నేరుగా జీవి నుంచి కాకుండా నేల, సముద్రజలం, గాలి వంటి పర్యావరణ నమూనాల నుంచి సేకరించే DNA ను 'E DNA గా పేర్కొంటారు. ఉత్తర ఆస్ట్రేలియాలో రంగురంగుల గౌల్డియన్ ఫించ్ అనే పక్షుల DNA ను ఇలాగే సేకరించారు.
అంతరించిపోయే పక్షి జాతులను పసిగట్టే "E DNA"