గర్భిణుల కోసం ప్రత్యేకంగా ఓ ఆహార ప్రణాళిక(డైట్ ఛార్జ్) ను రూపొందించాల్సిందిగా కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీని లోకసభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం కోరారు. ఆ ఛార్టను తమతమ నియోజక వర్గాల్లో పంపిణీ చేసుకునేందుకు వీలుగా సభ్యులందరికీ అందచేయాలన్నారు. ఈ ఛార్ట్ తయారీలో ప్రాంతీయ పరిస్థితులు, ఆహారపదార్థాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.