దారి మళ్లి ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న జమ్మూకశ్మీర్ యువతను సాధారణ జీవనంలోకి తీసుకురావడానికి భారత సైన్యం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. 'ఆపరేషన్ మా' పేరుతో ఇండియన్ ఆర్మీ ఫిబ్రవరిలో మొదలు పెట్టిన పథకం ద్వారా ఇప్పటివరకూ 60 మంది యువకులు ఉగ్రవాదం పడగ నీడను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. తమ కుటుంబాలను చేరుకుని ప్రశాంత జీవనం గడుపుతున్నారు.