ఉద్యోగం విషయంలో యువత సీరియస్ గా ఉండాలి


సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్లో పట్టణ పేదరిక నిర్ములన సంస్థ ఆధ్వర్యంలో 30 కంపెనీల ప్రతినిధులు మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో యువతీయువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగం విషయంలో యువతీయువకులు సీరియస్ గా ఉండాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీవితంలో ఏదయినా సాధించాలంటే లక్ష్యం ఉండాలన్నారు.