మాతృభాషను విస్మరిస్తే మట్టిలోకే..:పవన్


 తెలుగు భాషను విస్మరిస్తే ఎంతటివారైనా మట్టిలో కలిసిపోక తప్పదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో విశాలాంధ్ర బుక్ హౌస్, ఎమెస్కో పుస్తక విక్రయ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు భాష ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. మాతృభాష పరిరక్షణ కోసం ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు బయటకు రావాలని పవన్ పిలుపునిచ్చారు.