రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత సమస్యను వారం రోజుల్లోనే పరిష్కరించాలని BJP రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ ప్రభుత్వానికి వారం రోజుల డెడ్ లైన్ విధించారు. వారం రోజుల్లో ఇసుక కొరత తీర్చక పోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దయెత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వారం రోజుల్లో సమస్య తీరుస్తామని చెప్తోంది. అయితే తేదీ, నెల, సంవత్సరం చెబితే మంచిదని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.