శిష్యుడి కోసం...


విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం 'వాళ్లిద్దరి మధ్య'. వేదాన్డ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యం నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వీయన్ ఆదిత్య దర్శకుడు. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మొయినాబాద్లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కి చిత్ర దర్శకుడు వి.యన్. ఆదిత్య గురువు, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సతీసమేతంగా హాజరయ్యారు.