పెద్ద జట్లను ఓడించడాన్ని అలవాటుగా మార్చుకున్న బంగ్లాదేశ్ ను టీమ్ ఇండియా తేలిగ్గా తీసుకునే సాహసం చేయదు. పైగా టీ20ల్లో ఎవరు ఎవరి మీదైనా గెలవొచ్చు. నిషేధం కారణంగా షకిబ్, వ్యక్తిగత కారణాలతో తమీమ్ దూరమైనప్పటికీ.. కెప్టెన్ మహ్మదుల్లాతో పాటు ముష్ఫికర్ రహీమ్, సౌమ్య సర్కార్, లిటన్ దాస్, ముస్తాఫిజుర్ లాంటి ప్రతిభావంతులతో ఆ జట్టు ప్రమాదకరంగానే కనిపిస్తోంది. కష్టకాలంలో జట్టు పగ్గాలందుకున్న మహ్మదుల్లా కెప్టెన్ గా తన తొలి సిరీస్లో జట్టునెలా నడిపిస్తాడో చూడాలి.
అయినా ప్రమాదకరమే..