థాయిలాండ్ పర్యటన సమాప్తం....భారత్ కు మోదీ


 ఆసియాన్, ఆర్సెప్, తూర్పు ఆసియా సదస్సులకు హాజరైన ప్రధాని మోదీ స్వదేశానికి బయల్దేరారు. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "ఆసియాన్ సహా వివిధ శిఖరాగ్ర సమావేశాలకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ బ్యాంకాక్ నుంచి తిరుగు పయనమయ్యారు. యాక్ట్ ఈస్ట్, పొరుగుదేశాలు ముఖ్యం, ఇండో-పసిఫిక్ వంటి విధానాలతో ఆయా దేశాధినేతలతో ప్రధాని సమావేశమయ్యారు."అని రవీష్ కుమార్ ట్వీట్ చేశారు.