నా ఫోన్ ను ట్యాపింగ్ చేశారు

 



తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రధా నిమోదీ కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 'మొబైల్ ఫోన్ల నుంచి సమాచారం సేకరించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం . ఇది వ్యక్తిగత స్వేచ్చ మీద దాడి. దీంతో మనం ఎవరితో స్వేచ్చగా మాట్లాడలేం' అని ఆమె విలేకరులతో అన్నారు.