అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అందజేసే ANR జాతీయ పురస్కారం 2018 సంవత్సరానికి గాను దివంగత నటి శ్రీదేవికి దక్కింది. 2019 ఏడాదికిగాను ఈ అవార్డు నటి రేఖకు వరించింది. ఈ అవార్డుకు సంబంధించిన వివరాలను టి.సుబ్బరామిరెడ్డితో కలిసి టాలీవుడ్ అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున ప్రకటించారు. నవంబర్ 17న అన్నపూర్ణ స్టూడియోస్లో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డులను అందించనున్నారు.
శ్రీదేవి, రేఖలకు ANR జాతీయ పురస్కారం