బెంగళూరులోని బిడది ధ్యాన పీఠాధిపతి నిత్యానంద పరారీలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లైంగిక వేధింపులు తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద ఏడాదిన్నరగా బిడది ధ్యాన పీఠానికి రావడం లేదు. నిత్యానంద కోసం ధ్యానపీఠంలో వాకబు చేయగా ఆయన ఉత్తర భారత పర్యటనలో ఉన్నట్లు చెబుతున్నారు. నకిలీ పాస్పోర్టు ఉపయోగించి నిత్యానంద ఆస్ట్రేలియా దగ్గర్లోని ద్వీపానికి వెళ్లినట్లు వార్తలొచ్చాయి.