కర్తార్ పూర్ వేడుకను స్వాగతించిన అమెరికా


 కర్తార పుర్ నడవా ప్రారంభించడాన్ని అమెరికా స్వాగతించింది. పరస్పర ప్రయోజనాల కోసం భారత్-పాకిస్థాన్ దేశాలు కలిసి పనిచేయడానికి ఇది తోడ్పడుతుందని పేర్కొంది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చరిత్రాత్మక కర్తార పుర్ నడవాను శనివారం అధికారికంగా ప్రారంభించారు. భారతీయ సిక్కు భక్తులకు వీసాలేకుండానే దర్శనానికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత్ లో కర్తార్ పూర్ నడవా ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.