ఉత్తర కొరియా ప్రభుత్వం గురువారం నాడు తూర్పు సముద్రంలోకి రెండు గుర్తు తెలియని క్షిపణులను పరీక్షించింది. ద.కొరియా జాయింట్ ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (జెసిఎస్) కార్యాలయం వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం రెండు క్షిపణులను ఉ. కొరియా పరీక్షించిందని జెసిఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుమించి వివరించలేదు. ఉత్తర కొరియా తదుపరి పరీక్షలు నిర్వహించే అవకాశమున్నందున పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.