ఇది చేతకాని, ఆంబోతు ప్రభుత్వం: నారా లోకేష్

 


 


YCP ప్రభుత్వంపై TDP నేత లోకేష్ విరుచుకుపడ్డారు. ఇది చేతకాని, ఆంబోతు ప్రభుత్వమని ధ్వజమెత్తారు. తాను దీక్షకు దిగితే డైటింగ్ కోసం అన్నారని, ఏపీలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని విమర్శించారు. మీరు కేసులు వేస్తుంటే తాము ఊరుకుంటామా? అని లోకేష్ ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి రూ. 10 వేలు ఇచ్చి ఆదుకోవాలని నారా లోకేష్ మరోసారి డిమాండ్ చేశారు.