ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మొత్తం స్టీలో ఓ బోటును (యాట్)ను తయారు చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో కొనసాగుతున్న 60వ ఫోర్ట్ లాడర్ డేల్ అంతర్జాతీయ బోట్ల ప్రదర్శనలో ఇది విశేషంగా ఆకర్షిస్తోంది. తొమ్మిది వేల చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఈ బోటును 'మాన్షన్ యాట్'గా నామకరణం చేశారు. ఇందులో ఐదు బెడ్ రూమ్ లు, ఐదు బాత్ రూమ్ లు ఉండగా, పలు ఇండోర్, అవుట్ డోర్ సిట్టింగ్లు ఉన్నాయి.