మణిపూర్ లోని టెంగ్నోపాల్ ప్రాంతానికి చెందిన అనుమానంగా కనిపిస్తున్న ఓ వ్యక్తిని ఆర్మీ అధికారులు విచారించారు. విచారణలో విస్తుపోయే నిజం వెల్లడయింది. వారు అనుమానించినట్లే అతడి జేబులో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నాయి. 19 పాకెట్లలో ఉన్న నల్లమందును అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 92 లక్షల రూపాయలుంటుందని అధికారులు తెలిపారు. అతడిని ఆర్మీ అధికారులు తదుపరి విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు.
రూ. 92 లక్షల విలువ గల నిషేధిత డ్రగ్స్ స్వాధీనం