భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

 



 తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామా స్మరణతో శైవక్షేత్రాలు మార్మోగిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని శ్రీశైలం పుణ్య క్షేత్రానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు.