అబ్బాయిల వివాహ వయస్సును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను బాలల హక్కుల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. వివాహ వయస్సు తగ్గించడం ద్వారా చిన్నవయస్సులో పెళ్లిళ్లరిగితే ఆజంట ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు పేర్కొన్నారు.చిన్నతనంలో పిల్లలను కనడంతో మానసిక శారీరక వికలాంగులుగా జన్మించే అవకాశం వుందన్నారు.